గణపతి పూజ..ఈ ఏడు వస్తువులు తప్పకుండా ఉండాల్సిందే!

by Jakkula Mamatha |
గణపతి పూజ..ఈ ఏడు వస్తువులు తప్పకుండా ఉండాల్సిందే!
X

దిశ,వెబ్‌డెస్క్:నేడు దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అవుతాయి. ఈ వేడుకలు ఎక్కడ చూసినా ఓ రేంజ్‌లో నిర్వహించుతారు. ఈ క్రమంలో వినాయక మండపాలను ఎంతో అందంగా అలంకరిస్తారు. పది రోజుల పాటు ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలను జరిపించడం జరుగుతోంది. అనంతరం భక్తుల నడుమ భారీ ఊరేగింపుతో బొజ్జ గణపయ్య తన తల్లి గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. అయితే వినాయక విగ్రహం తెచ్చింది మొదలు.. ప్రతిష్టించి పూజ చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే గణపయ్యకు ఆగ్రహం వస్తుంది.

సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరునికి తీపి పదార్థాలు ఎంతో ఇష్టం. కాబట్టి, వినాయక చవితి రోజున స్వామి వారికి స్వీట్స్ నైవేద్యంగా పెడితే ఎంతో ఫలప్రదమని పురాణాలు చెబుతున్నాయి. అయితే వినాయక పూజకు ఏడు రకాల తీపి పదార్థాలు నైవేద్యంగా పెడితే జీవితంలో సుఖసంతోషాలు సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. మరి నేడు స్వామి వారికి సమర్పించాల్సిన నైవేద్యం ఏమిటో, వాటితో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

*ఉండ్రాళ్ళు: గణపయ్యకు ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం. కనుక గణపతి పూజ సమయంలో తప్పకుండా ఉండ్రాళ్ళు ఉండేలా చూసుకోవాలి. అయితే 21 ఉండ్రాళ్ళను పెట్టే సంప్రదాయం ఉంది. కనుక బొజ్జ గణపయ్యకు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. తర్వాత ఆ ప్రసాదాన్ని పిల్లలకు పంచితే మీ బాధలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

*కుడుములు: గణేశునికి నైవేద్యం పెట్టే ఆహార పదార్ధాలలో తప్పనిసరిగా మోదకం(కుడుములు) ఉండాలి. పార్వతీదేవి తన బుజ్జి గణపయ్యకు రుచికరమైన కుడుములు తినిపించిందని హిందువులు నమ్ముతారు. అప్పటి నుంచి కుడుములు వినాయకుడికి ఇష్టమైన ఆహారంగా పరిగణించబడుతుంది. అందుకే గణేశ పూజలో తప్పనిసరిగా కుడుములు నైవేద్యంగా పెడతారు.

*దర్బ గడ్డి: గణేశుని ప్రసన్నం చేసుకోవడానికి వినాయక చవితి రోజున తప్పని సరిగా దర్భని సమర్పించండి. గణేశ పూజకు దర్భని ఉపయోగించడం వలన వినాయకుడు ఎంతో సంతోషిస్తాడని హిందువులు నమ్మకం.

*పసుపు: గణేషుడికి పసుపు చాలా ఇష్టమైన రంగు. చిన్ని గణపయ్యకు ఇష్టమైన వస్తువులలో పసుపు ఒకటిగా చెబుతుంటారు. గణేష్ పూజా సమయంలో గణపయ్యను ప్రసన్నం చేసుకోవడానికి పచ్చి పసుపుతో వినాయకుడిని చేయండి. ఆ తర్వాత తొలి పూజ చేసి ఆ పసుపు వినాయకుడిని గదిలో లాకర్లో ఉంచండి. దీంతో గణేష్ పూజ విజయవంతం కావడంతో పాటు మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

*అరటిపండు: పూజ చేసే వస్తువుల్లో అరటి పళ్ళు తప్పని సరిగా ఉండాలి. అయితే ఎప్పుడూ ఒక్క అరటిపండు దేవుడికి నైవేద్యంగా నివేదించకండి. వినాయక చవితి రోజున వినాయకుడికి రెండు కంటే ఎక్కువ అరటిపండ్లు సమర్పించండి.

*కుంకుమ: గణేశుడికి సిందూరాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అంగారకుడి గుర్తుగా గణపతి పూజలో కుంకుమని సమర్పిస్తారు.

*పసుపు పువ్వులు: వినాయక చవితి రోజున గణేశుడికి ఒక్క మొగలి పువ్వు మినహా అన్ని రకాల పూలను సమర్పించవచ్చు. అయితే గణపతి బప్పాకు ముఖ్యంగా పసుపు పువ్వులంటే చాలా ఇష్టం. అయితే పొరపాటున కూడా గణపతి పూజలో ఎప్పుడూ తులసి దళాలను సమర్పించవద్దు.

నోట్:ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story