- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీత దేవి స్నానం చేసిన గుండం.. ఇప్పటికీ అలాగే ఉన్న పాదముద్రలు..
దిశ, వెబ్ డెస్క్ : చిత్రకూట్ ఈ నగరం గురించి చాలామంది వినే ఉంటారు. ఈ స్థలాన్ని శ్రీరాముడు నడయాడిన పవిత్ర స్థలంగా పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే వనవాస కాలంలో శ్రీరాముడు సీతాసమేతంగా, సోదరుడు లక్ష్మణుడితో పాటు ఈ ప్రాంతంలోనే నివసించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరుణంలోనే సీతాదేని స్నానమాచరించిన ఓ కొలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటికీ ఆ ప్రాంతంలో సీతాదేవి పాద ముద్రలు ఉన్నాయంటున్నారు అక్కడి ప్రజలు. అందుకే వేలాది మంది భక్తులు నిత్యం అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వెళుతుంటారని చెబుతున్నారు.
జానకి కుండ్..
జానకి కుండ్ చిత్రకూట్‌లోని ఓ ప్రాంతంలో వెలసిన తీర్థం. ఇక్కడే సీతదేవి స్నానం చేసిన కొలను ఉందని చెబుతున్నారు. ఇప్పటికీ అక్కడ సీతా దేవి నడిచిన అడుగుల గుర్తులు ఉన్నాయని చెబుతారు. అంతే కాదు ఆ ప్రదేశంలోనే సీతాదేవి అలంకరించుకునేదని చెబుతున్నాయి పురాణాలు. ఈ పాద ముద్రికల దర్శనం కోసం ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని చెబుతున్నారు.
ఆలయ పూజారి రామ్ అవతార్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీ రాముడు వనవాసం చేస్తున్న సమయంలో చిత్రకూట్‌కు చేరుకున్నాడని తెలిపారు. ఈ ప్రాంతంలో సీతామాత స్వయంగా చేసిన యాగ కర్మలో హవన పూజను నిర్వహించేదని చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ చిత్రకూట్‌లోని జానకి కుండ్ ఆలయంలో ఉన్నాయని చెబుతున్నారు.