అప్పుడు ఏమైంది ఇప్పుడు విమర్శిస్తున్నారు : శ్రీవాస్తవ

by Shamantha N |
అప్పుడు ఏమైంది ఇప్పుడు విమర్శిస్తున్నారు  : శ్రీవాస్తవ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఆందోళనలపై పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ మంగళవారం స్పందించారు. రైతు సంఘాల నిరసనల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతతో కూడిన భారీకేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే, దీనిపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తు్న్నారు. ఈ విషయంపై సీపీ శ్రీవాస్తవ స్పందిస్తూ.. ‘‘జనవరి-26 గణతంత్ర వేడుకల్లో రైతులు ట్రాక్టర్లును తీసుకొచ్చి భారీకేడ్లను ఢీకొట్టినపుడు మీరంతా ఏమయ్యారు.

నిరసనకారుల దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా మేర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ప్రశ్నించని మీరు.. ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ అలాంటి ఘటనలు రిపీట్ కాకుండా భద్రతను ఏర్పాటు చేస్తే ఎందుకు వాయిస్ పెంచుతున్నారని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా, ఇప్పుడు ఏం చేయమంటారు అని విమర్శకులను అడిగారు’’. మేము ఎవరినీ ఇబ్బందులకు గురిచేయడం, దాడులకు పాల్పడటం లేదని కేవలం భద్రతను పెంచుతున్నామని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story