కేంద్రం కీలక నిర్ణయం.. యుద్ధ సమాచారం బహిర్గతానికి ఒకే

by Shamantha N |   ( Updated:2021-06-12 09:25:03.0  )
Defence Ministry rajnath singh okays policy to archive, declassify histories of wars, operations
X

న్యూఢిల్లీ : యుద్ధాలు, యుద్ధ ఆపరేషన్లు, ఇతర వివరాలను బహిర్గతపరచడానికి కేంద్రం ఓకే చెప్పింది. వీటన్నింటిని మదించి, కూర్పు చేసి, ప్రచురించడానికి, నేషనల్ ఆర్కైవ్స్‌లో పొందుపరచనుంది. ఐదేళ్లలో కూర్పు పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ వివరాల్లో కేంద్రం సున్నితంగా భావిస్తే వాటిని నిలిపేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నూతన పాలసీకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ పాలసీ కింద రక్షణ మంత్రిత్వ శాఖలోని అన్ని డిపార్ట్‌మెంట్లు వార్ డైరీలు, లెటర్లు, ఆపరేషనల్ రికార్డులు, ఇతరలత్రాలన్నీ హిస్టరీ డివిజన్‌కు పంపించాల్సి ఉంటుంది.

ఈ వివరాలన్నీ 25ఏళ్లలో డీక్లాసిఫై చేయాలి. రక్షణశాఖ సంయుక్త కార్యదర్శి సారథ్యంలోని కమిటీ కూర్పు చేపడుతుంది. యుద్ధాలు జరిగితే వివరాలను సమకూర్చుకోవడానికి ప్రత్యేకంగా టైమ్‌లైన్‌నూ పాలసీ నిర్దేశించింది. యుద్ధం జరిగిన రెండేళ్లలో కమిటీ ఏర్పడాలి. మూడేళ్లలో వివరాల కూర్పు పూర్తవ్వాలి. ఇలా సమగ్ర వివరాలను సంకలనం చేసుకుంటే పాత ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని, అసత్య కథనాలను సులువుగా ఎదుర్కోవచ్చని కార్గిల్ రివ్యూ కమిటీ సూచించినట్టు ప్రకటనలో కేంద్రం పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed