అది సిగ్గుతో తలదించుకునే సంఘటన

by Anukaran |   ( Updated:2020-07-12 04:07:20.0  )
అది సిగ్గుతో తలదించుకునే సంఘటన
X

దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లాలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. బంధాలు, బాంధవ్యాలు, మానవ విలువలు ఏ స్థాయికి పతనమయ్యాయో తెలిపేలా కన్నతండ్రి కూతురిపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గమైన ఘటన సీతానగరం మండలం నిడగల్లులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీతానగరం ఎస్సై వి. లోవరాజు తెలిపిన వివరాల్లోకి వెళ్తే… నిడగల్లు గ్రామానికి చెందిన పైల మైనరుకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరికీ వివాహాలు కావడంతో అదే గ్రామంలో వారు వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. అయితే పెద్ద కుమార్తెపై ఎప్పటినుంచో కోరిక కలిగిన ఆ ప్రబుద్ధుడు భార్య ఆరోగ్యం బాగులేందున పెద్దకుమార్తెను తీసుకురమ్మని చిన్నకుమార్తెను పంపించాడు.

తల్లికి బాలేదన్న వార్తతో ఆమె పుట్టింటికి వచ్చిన పెద్ద కుమార్తెపై ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆమె అదేరోజు సాయంత్రం గ్రామ వాలంటీర్, సచివాలయ పోలీస్ కు సమాచారం అందివ్వగా వారి ఫిర్యాదు మేరకు బొబ్బిలి రూరల్‌ సీఐ బి.ఎం.డి.ప్రసాదరావు, సీతానగరం ఎస్సై వి.లోవరాజు హుటాహుటిన గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. మహిళా పోలీసుల ద్వారా బాధితరాలిని అన్ని కోణాల్లో విచారణ జరిపి, కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్ కి తరలించారు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Advertisement

Next Story