- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘రాబోయే రోజుల్లో కేసీఆర్ను దళిత ఓట్లతోనే ఓడిస్తాం’
X
దిశ, హుజూర్నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో దళితబంధు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ఇందిరా భవన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీగా వచ్చి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 50 వేలకు పైగా దళిత ఓట్లు ఉన్నాయని, హుజూరాబాద్ నియోజకవర్గంలో మాదిరిగా ఇక్కడ కూడా దళిత బంధు తక్షణమే అమలు చేయాలన్నారు. కేసీఆర్ మాయ మాటలతో గారడి చేస్తూ దళిత బంధు పేరుతో మరొకసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ను దళిత ఓట్లతోనే ఓడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, జక్కుల మల్లయ్య, అజీమ్ పాషా, నారాయణ, వీరబాబు, కోటి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story