ఏడు సార్లు ఎంపీ.. అనుమానాస్పద మృతి.. ఏం జరిగింది..?

by Shamantha N |   ( Updated:2021-02-22 08:09:45.0  )
ఏడు సార్లు ఎంపీ.. అనుమానాస్పద మృతి.. ఏం జరిగింది..?
X

ముంబయి: ఏడుసార్లు ఎంపీగా గెలిచిన నాయకుడికి రాజకీయాల్లో ఉండే విలువ అంతా ఇంతా కాదు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అటువంటి వ్యక్తి గ్రామ పర్యటనకు వచ్చిన చర్చనీయాంశం అవుతోంది. కానీ, ఎక్కడా లేని విధంగా 7 సార్లు ఎంపీగా గెలిచిన మోహన్ దేల్కర్(58) ఓ హోటల్‌లో విగతాజీవిగా కనిపించడం దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది.

కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ నుంచి ఏడు సార్లు ఎంపీగా గెలుపొందిన మోహన్ దేల్కర్(58) సోమవారం మహారాష్ట్రలోని ఓ హోటల్‌లో విగతజీవై కనిపించారు. ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ముంబయి పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే స్పష్టత వస్తుందని తెలిపారు. దేల్కర్ జేబులో సూసైడ్ నోట్ లభించిందని చెప్పారు. మోహన్ దేల్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జేజే హాస్పిటల్ తరలించారు. వివరాల కోసం హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

దక్షిణ ముంబయి మెరైన్ డ్రైవ్‌లో సీ గ్రీన్ హోటల్‌లోని ఐదో అంతస్తులో కొన్నాళ్లు ఎంపీ మోహన్ దేల్కర్ ఉన్నారని తెలిసింది. అదే హోటల్‌ రూంలో మోహన్ దేల్కర్ మృతదేహం కనిపించింది. స్వతంత్ర ఎంపీ మోహన్ దేల్కర్ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడారు. గిరిజనుల హక్కుల న్యాయవాది అయిన దేల్కర్ సిల్వాసాలో కార్మిక నేతగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1989లో కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారి 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Advertisement

Next Story

Most Viewed