మహేశ్ బాబు ఫొటోను ఇలా వాడేసిన సైబరాబాద్ పోలీసులు..

by Shyam |
మహేశ్ బాబు ఫొటోను ఇలా వాడేసిన సైబరాబాద్ పోలీసులు..
X

దిశ, సినిమా : సైబరాబాద్ పోలీసులు జనాలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. అది కూడా ట్రెండీగా చెప్పేందుకు ట్రై చేస్తుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్లను ఎంచుకుని.. మీమ్స్ క్రియేట్ చేస్తూ చెప్పాలనుకున్న విషయాన్ని జనాలకు సూటిగా చేరవేస్తుంటారు. ఇప్పటి వరకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించిన పోలీసులు.. ఇప్పుడు కరోనా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫొటోను వాడారు. డెనిమ్ జీన్స్, జాకెట్ వేసుకున్న మహేశ్ పిక్‌ను షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. ‘డెనిమ్ మీద డెనిమ్ ఫ్యాషన్ ట్రెండ్, మాస్క్ మీద మాస్క్ సేఫ్టీ ట్రెండ్’ అంటూ మాస్క్ ఇంపార్టెన్స్ గురించి ఈ ఫొటో ద్వారా వివరించారు. సేఫ్టీ ఫస్ట్.. స్టైల్ నెక్స్ట్ అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story