- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
దిశ, సత్తుపల్లి: ప్రమాదవశాత్తూ సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం బుగ్గపాడు లో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గపాడు గ్రామానికి చెందిన మడిపల్లి జితేంద్రకుమార్ (10) తండ్రి. శ్రీనివాసరావు, పామర్తి శశాంక్ (10) తండ్రి. కిషోర్ స్థానిక పాఠశాలలో 3 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సోమవారం పాఠశాలకు సెలవు దినం కావడంతో బుగ్గపాడు సమీపంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలువ ను చూసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు, ఇద్దరు విద్యార్థులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో బుగ్గపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.