Arrest : నిషేధిత గంజాయి పట్టివేత

by Aamani |   ( Updated:2024-07-24 15:40:43.0  )
Arrest : నిషేధిత గంజాయి పట్టివేత
X

దిశ,కాగజ్ నగర్ : కాగజ్ నగర్ మండలం ఇస్గాం గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్టార్ స్పోర్ట్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం కొమురం భీం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కాగజ్ నగర్ మండలం ఇస్గాంలో గంజాయి విక్రయాలు చేస్తున్నారనే సమాచారం తో విలేజ్ నెంబర్ 8లో దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ మండల్ ఇంట్లో తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. 200 గ్రాముల గంజాయి అతని నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి విలువ రూ.6 వేల విలువ ఉంటుందన్నారు. నిందితుడు మహారాష్ట్ర నుంచి గంజాయిని తెచ్చి ఇస్గాం పరిసర గ్రామాల ప్రజలకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీఐ వెంట వెంకటేష్, మధు, రమేష్ పాల్గొన్నారు.

Read more....

Arrest : గంజాయి విక్రయానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

Advertisement

Next Story

Most Viewed