- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు…ఇద్దరు మృతి
దిశ పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం పొగాకు కంపెనీ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్ ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి కర్నూల్ వెైపు వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్ టి ఎస్ 09 జెడ్ 7824, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో రంగాపురం గ్రామానికి చెందిన పెండ్లి రాముడు (60) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మసీద్ శేఖర్ (58) తీవ్రంగా గాయపడగా హైవే అంబులెన్స్ లో వనపర్తి ప్రభుత్వాసుపత్రి చికిత్స కోసం తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే చనిపోయినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు.. పొలం పనుల నిమిత్తం టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై గ్రామానికి చెందిన పెండ్లి రాముడు, మసీద్ శేఖర్ పొగాకు కంపెనీ దగ్గర క్రాస్ రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు వేగంగా ఢీకొట్టింది. గ్రామంలో ఒకే కులానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడం తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.