రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం

by Jakkula Mamatha |   ( Updated:2024-04-18 14:37:04.0  )
రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం
X

దిశ, బద్వేల్: ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం గోపవరం మండలం పిపి కుంట వద్ద తనిఖీలు నిర్వహించగా భారీ మొత్తంలో బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 5 కోట్ల ఉంటుందని అధికారులు తెలిపారు. నెల్లూరు నుంచి కడప వైపు వస్తున్న సీక్వెల్ గ్లోబల్ ప్రైసీయస్ లాజిస్టిక్స్ కంపెనీ కి చెందిన బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో సుమారు 29 కేజీల బంగారం, వెండి వస్తువులు ఉన్నట్లు వారు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు చూపిన పత్రాలు పరిశీలించిన అనంతరం ఈ సొమ్మును సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖకు అందజేస్తామని అధికారులు తెలిపారు. తనిఖీ లో సీఐ విక్రమ సింహ, ఎస్ఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read More..

నెల్లూరు కుర్రాళ్లతో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇంటర్‌నెట్‌ను ఊపేస్తున్న వీడియో

Advertisement

Next Story