BTech student Death: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

by Sridhar Babu |   ( Updated:2024-07-24 15:38:04.0  )
BTech student Death: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
X

దిశ, కోరుట్ల రూరల్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని సంగెం గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పొత్కూరి రవీందర్ రెడ్డి- స్వప్న దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. హైదరాబాద్ లో కూతురు బీటెక్ మూడో సంవత్సరం, కొడుకు పొత్కూరి హర్షవర్ధన్ రెడ్డి(22) బీటెక్

రెండవ సంవత్సరం చదువుతున్నారు. కాగా హర్షవర్ధన్ రెడ్డి తన స్నేహితునితో కలిసి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి మంగళవారం రాత్రి ద్విచక్రవాహనంపై తిరుగు వస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని పోచారం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇనుప కంచెను ఢీ కొట్టింది. దీంతో హర్షవర్ధన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Read more...

Missing :తమను వెతకవద్దని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అక్కా తమ్ముడు

Advertisement

Next Story

Most Viewed