- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోడకూలి ఇద్దరు మృతి… మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
by Kalyani |
X
దిశ, చిన్నశంకరంపేట: కోళ్ల ఫారం గోడ కూలిపోయి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజన తండా లో చోటుచేసుకుంది. ఎస్సై నారాయణ గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కామారం తండా పంచాయతీ పరిధిలో కోళ్ల ఫారం నిర్మాణ పనులు చేస్తున్న జార్ఖండ్ రాష్ట్ర వలస కూలీల పై గోడకూలి పడటంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందినట్లు ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు. సంఘటన స్థలానికి వెళ్ళి ఇద్దరి శవాల పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్. ఐ నారాయణ గౌడ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story