వడదెబ్బతో వ్యక్తి మృతి..!

by Sumithra |
వడదెబ్బతో వ్యక్తి మృతి..!
X

దిశ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని పూలబజారులో నివాసం ఉండే మహమ్మద్ అబ్దుల్ అజీజ్ (40) ఆదివారం వడదెబ్బ తగిలి మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మహమ్మద్ అబ్దుల్ అజీజ్ మున్సిపాలిటీ కేంద్రంలో పాన్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఎండ తీవ్రతకు వడదెబ్బ తగలడంతో ఇంటికి వెళ్లి స్పృహ తప్పి పడిపోయాడు.

అది గమనించిన కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ వైద్యుడు దగ్గరికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమిస్తుందని ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారన్నారు. ఖమ్మం వైద్యులు కూడా హైదరాబాద్ తీసుకువెళ్ళాలని సూచించగా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చేర్పించారని తెలిపారు. కాగా వైద్యం తీసుకుంటూ అజీజ్ ఆదివారం చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

Next Story