- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అమాయకులను హత్య చేసింది...సైకో కిల్లర్...!?
దిశ, మెదక్ ప్రతినిధి : హత్యలు పగతో చేస్తారు..లేదా ప్రతీకారంతో చేస్తారు.. కానీ ఈ నిందితుడు మాత్రం ఒంటరి వ్యక్తులను పరిచయం చేసుకొని మద్యం తాగించి అమాయకులను ఆ కారణంగా హత్య చేశాడు. ఇద్దరిని దారుణంగా హత్య చేసిన సైకో కిల్లర్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఎస్పీ కార్యాలయం వివరించారు. మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండల కేంద్రంలో గత నెల 22న, నవంబర్ 3న ఒకే తరహాలో రెండు హత్యలు జరిగాయి. హత్యలు గురైన ఇద్దరు ఆచూకీ లభ్యం కపోవడంతో మెదక్ జిల్లా పోలీసులు చాలెంజ్ గా తీసుకొని విచారణ జరిపారు. ఇందులో భాగంగా హత్యకు ముందు రోజులు చిన్న శంకరం పేట మండల కేంద్రంలో తిరిగిన వారి వివరాలు ఆరా తీయగా గతంలో నేర చరిత్ర ఉన్న ఒట్టేమ్ మల్లేశం పై అనుమానం కలిగింది.
గత నెల 22న ఒంటరిగా ఉన్న కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట కు చే దిన నవీన్(24) పరిచయం చేసుకొని స్నేహం చేశాడు. ఇద్దరు కలిసి చిన్న శంకరం పేట వైన్స్ లో మద్యం తీసుకొని కలిసి తాగారు. మద్యం మత్తులో ఉన్న నవీన్ ను బండరాయితో హత్య చేసి మల్లేశం మృతుడి వద్ద ఉన్న వస్తువులు తీసుకొని తగలబెట్టారు. అదే విధంగా ఈ నెల 3న నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్ణ పల్లికి చెందిన కొమ్రే స్వామి(39) నీ కూడా అదే విధంగా తీసుకు వచ్చి చిన్న శంకరం పేట మండల కేంద్రంలో హత్య చేసి కాల్చి వేశాడు. రెండు హత్యలు వరస క్రమంలో జరగడం సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి విచారణ చేయగా హంతకుడు చిన్న శంకరం పేట మండలం రుద్రారాం కు చెందిన మల్లేశం గా గుర్తించి విచారణ చేపట్టగా మల్లేశం పై గతంలో నేర చరిత్ర ఉన్నట్టు గుర్తించారు.
మల్లేశం 2013 లో చిన్న శంకరం పేట పోలీస్ స్టేషన్ లో నమోదైన హత్య కేసులో పదేళ్లు జైలు లో ఉన్నాడు. 2017 లో సెంట్రల్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ ను వేధించగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ బాధితుడి ఫిర్యాదు తో కేసు నమోదైంది. తర్వాత వచ్చిన మల్లేశం మనసులో పెట్టుకొని నేతాజీ నగర్ లో జూనియర్ అసిస్టెంట్ ఇంటి వద్ద ఉన్న సామాగ్రి, కూలర్, ఇంటి తలపులు కాల్చి వేసిన కేసులో సైతం జైల్ కు వెళ్ళాడు. 2022 లో జైలు నుంచి వచ్చిన మల్లేశం నిజామాబాద్ కాచిగూడ రైల్ లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్లాట్ ఫాం పై ఒంటరిగా ఉండే వారిని పరిచయం చేసుకొని వాటికి మద్యం తాగించి అకారణంగా హత్య చేసి వారి వద్ద ఉన్న నగలు, ఇతర వస్తువులు దోచువడం ఆనవాయితీగా మారింది.
దొంగలించిన డబ్బులు అతని సోదరుడు రమేష్ కు ఇచ్చే వాడు. రైల్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి పై దాడి చేసి అతడి వద్ద ఉన్న ల్యాప్ టాప్, ఇతర బంగారు వస్తువులు చోరీ కేసు రైల్వే పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఉన్నట్టు ఎస్పీ చెప్పారు. మల్లేశం హత్య చేసేందుకు ఎలాంటి కారణాలు లేవని, కేవలం వారి వద్ద ఉన్న బంగారం, డబ్బుల కోసమే హత్య చేసేవాడని తెలిపారు. రెండు హత్య కేసులు ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తక్కువ సమయంలో ఛేదించారని, ఇందుకు వారిని ఎస్పీ ప్రశంసించారు. ఈ సమావేశంలో ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్ఐ నారాయణ, బాల రాజ్ తో పాటు సిబ్బంది ఉన్నారు.