- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి లో ఓ రైతు సాగులో ఆశించిన దిగుబడులు రాకపోవడమేమో, విక్రయానికి కష్టాలేమో తెలియదు. ఎక్కడి నుండో దిగుమతి చేసుకోవడం ఎందుకు తానే సాగు చేస్తే పోయేది ఏముంది అనుకున్నడేమో..తానే స్వయంగా తన చేనులో గంజాయి సాగు ను ఎంచుకున్నాడు. జిల్లాలోని రేచపల్లి గ్రామానికి చెందిన పోతుగంటి తిరుపతి అనే రైతు తన పంట చేలల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో సారంగాపూర్ పోలీసులు అతని వ్యవసాయ క్షేత్రాన్ని రహస్యంగా సందర్శించి అక్కడ నిషేధిత గంజాయిని సాగు చేస్తున్నట్లు తెలుసుకొని నిందితుడిని అరెస్టు చేసి గురువారం రిమాండ్ కు తరలించారు. కాగా సారంగాపూర్ ఎస్సై దత్తాత్రేయ కథనం ప్రకారం తిరుపతి పొలంలో 17.39 కిలోల పచ్చి గంజాయి, 300 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీని విలువ రూ.97,500 ఉంటుందని, ఎస్ఐ వివరించారు. అయితే ఈ రైతు కొంతకాలంగా గంజాయి సాగు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.