భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య..

by Kalyani |
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య..
X

దిశ, నవాబుపేట: మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని కూచూర్ గ్రామానికి చెందిన జోగు రామస్వామి (45) మంగళవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై పురుషోత్తం తెలిపారు. రామస్వామికి గల అనారోగ్యం విషయంలో భార్యాభర్తలు ఇరువురు తరచూ గొడవపడేవారని, మంగళవారం కూడా భార్యతో గొడవపడిన రామస్వామి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య కలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story