- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనీస ప్రమాణాలు పాటించని ఆసుపత్రి సీజ్..
దిశ, నాగారం: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని నాగారం మున్సిపాలిటీ పరిధిలో కనీస ప్రమాణాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించిన ఓ ఆసుపత్రిని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ సీజ్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్య బృందానికి నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఆసుపత్రిలో గత కొంతకాలంగా సరిపడా వైద్యులు లేరని ఆరోపణలు వచ్చాయి. అలాగే ఆసుపత్రిలో రోగులకు సరైన మౌలిక వసతులు కల్పించడం లేదని స్థానికులు, ప్రజలు వాపోయారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ప్రభుత్వాధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
ఆసుపత్రి వైద్య బృందానికి నోటీసులు జారీ చేశారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కాసర్ల మణికంఠారెడ్డి, మెడికల్ డైరెక్టర్ సురేశ్‌ను పదవీ నుంచి తొలగించాలని ఉత్తర్వులు అందించారు. గత కొంతకాలంగా ఆసుపత్రిలో అర్హత లేని వైద్యులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. దీంతో వివిధ రకాల ప్రభుత్వ చట్టాల ప్రకారం.. ఆసుపత్రిని సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు.