- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cybercrime : CBI, IPS officer పేరుతో ఫేక్ కాల్..
దిశ, అచ్చంపేట : సైబర్ నేరగాళ్లు నూతన పద్ధతులను అవలంబిస్తూ పలువురికి ఫేక్ కాల్ చేస్తూ డబ్బులు సునాయాసంగా వసూలు చేస్తున్న దందా నల్లమలలో జోరుగా సాగుతుంది. గత కొద్ది రోజులుగా అచ్చంపేట నియోజకవర్గంలో సీబీఐ ఐపీఎస్ ఆఫీసర్ పేరుతో ఈ ఫోన్ నెంబర్ 923196519606 ద్వారా బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు పట్టణవాసులు వాపోతున్నారు. బుధవారం అదే నెంబర్ తో సీబీఐ ఐపీఎస్ ఆఫీసర్ అని ట్రూ కాలర్ వస్తూ అచ్చంపేట పట్టణానికి చెందిన కౌన్సిలర్ మనోహర్ ప్రసాద్ కు ఫోను వచ్చింది. అది చూసిన వెంటనే సైబర్ నేరగాళ్లు ఇలా చేస్తున్నారని ఉదయం దిశకు ప్రత్యక్షంగా వచ్చిన ఫోన్ నెంబర్ కాల్ ని చూయించారు. తాను దిశతో మాట్లాడుతూ అచ్చంపేట పట్టణంలో చాలా మందికి ఫోన్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మీ కూతురు డ్రగ్స్ లో పట్టు పడ్డది ?
సైబర్ నేరగాళ్లు ఏకంగా పోలీస్ ఉన్నతాధికారుల డీపీ ఫోటోలతోనే ఫోన్ చేస్తూ.. పలానా మీ కూతురు డ్రగ్స్ లో పట్టు పడ్డది. లక్ష, యాభై వేలు 923196519606 ఈ నెంబర్ కు పంపిస్తే గుట్టు చప్పుడు కాకుండా కేసును మాఫీ చేస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని తెలిసింది. అచ్చంపేట పట్టణంలో చెందిన ఒక మేస్త్రి కూతురు డ్రగ్స్ తో పట్టు పడ్డదని, వెంటనే 50 వేలు పంపించాలని ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆందోళన చెందిన మేస్త్రి పట్టణంలోని ఆ విద్యార్థిని చదువుతున్న కళాశాలకు పరుగు పరుగున వెళ్లి తన కూతురు ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకున్నారు.
అలాగే మరో దివ్యాంగ మహిళకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి పై విధంగానే బెదిరించడంతో లక్ష రూపాయలను వారికి పంపించి.. తాను మోసపోయిన విషయం ఆలస్యంగా తెలుసుకున్నట్లు పట్టణంలో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ సైబర్ నేరగాళ్లు తమకు అందిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అమాయక ప్రజలను చాలా సులువుగా బోల్తాపడేసి డబ్బులు కాజేస్తు ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఇలాంటి కేసులను ఛేదించడంలో పోలీసులు మరింత అప్రమత్తతో సైబర్ నేరగాలను కట్టడి చేస్తూ ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది.
ఆ నెంబర్ కు 12 అంకెలు.. జాగ్రత్త పడండి
అన్ని ఫోన్ నెంబర్ అంకెలు 10 ఉంటే సైబర్ నేరగాల్లది 12 అంకెలతో ఫోన్ నెంబర్ వస్తున్నది. 923196519606 నెంబర్ ను పరిశీలించినట్లయితే 12 అంకెలు ఉన్నాయి. ఏకంగా పోలీసు ఉన్నత అధికారుల డీపీ ఫోటోలతో ఫోన్ వస్తుండడంతో కొన్ని సందర్భాలలో నిజమే అయి ఉంటుందని ప్రజలు అందులో చెందుతున్నారు.