నిన్న తల్లి.. నేడు చిన్నారి మృతి..

by Sumithra |
నిన్న తల్లి.. నేడు చిన్నారి మృతి..
X

దిశ, నిజామాబాద్ క్రైం : అపార్ట్ మెంట్ నుంచి దూకిన ఘటనలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆదివారం మృతి చెందింది. దాంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం నిజామాబాద్ నగర శివారులోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు సమీపంలో ఆర్ కేఆర్ అపార్ట్ మెంట్ నుంచి జటల అనూష తన చిన్న కూతురు శ్రీకృతితో కలిసి దూకింది. దీంతో తల్లి అనూష అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.

భర్త మరణాన్ని జీర్ణించుకోలేక రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంకు చెందిన జటల అనూష తన చిన్నకూతురితో అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెల్సిందే. పెద్ద కూతురును శ్రీహితను తీసుకుని గత నెలక్రితం పెద్దమ్మ పెద్దనాన్న ఇంటికి వచ్చిన విషయం విధితమే. తల్లిదండ్రులు లేకుండా పెరిగిన తనకు భర్త వియోగంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. నాలుగు నెలల క్రితం తండ్రి శని, ఆదివారాల్లో తల్లి, సోదరి మరణించడంతో శ్రీహిత అనాథగా మారింది. అనూష ఆత్మహత్యకు ముందు పెద్దకూతురు శ్రీహితను తన సోదరుడు దత్తత తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story