- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెలిగ్రామ్ యూజర్లకు అలర్ట్.. యువతులతో ఫోన్ చేయించి సైబర్ క్రిమినల్స్ కొత్త తరహా మోసం!
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: సైబర్ కేటుగాళ్లు మళ్లీ పంజా విసిరారు. ఓ రియల్టర్‌కు టోకరా పెట్టి ఎనిమిది లక్షలు కొల్లగొట్టారు. టెలిగ్రామ్ యాప్ వాడుతున్న వారిని టార్గెట్‌గా చేసుకుంటూ సైబర్ క్రిమినల్స్ అందినకాడికి దోచుకుంటున్న విషయం తెలిసిందే. యువతులతో ఫోన్లు చేయిస్తూ మేము పంపించే యూట్యూబ్ వీడియోల లింకులు ఓపెన్ చేసి లైక్ కొట్టండి.. షేర్ చెయ్యండి.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించండి అని చెప్పిస్తూ ఉచ్చులోకి లాగుతున్నారు.
తాజాగా ముషీరాబాద్‌కు చెందిన ఓ రియల్టర్‌కు ఇలాగే ఫోన్ చేసి యూట్యూబ్ వీడియో లింకులు పంపించారు. కొన్నిరోజులు కమీషన్‌గా సదరు రియల్టర్ అకౌంట్‌లో డబ్బు కూడా జమచేశారు. పూర్తిగా తమ వలలో పడ్డాడని నిర్ధారించుకుని ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లు ఉన్నాయని విడతల వారీగా ఎనిమిది లక్షలు దోచేశారు. మోసపోయినట్టు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.