LAW స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |
LAW స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ లా విద్యార్థిని(Law student)పై సామూహిక అత్యాచారం(Gang Rape) కేసుపై విశాఖ బార్ కౌన్సిల్(Visakha Bar Council) సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుల తరుపున ఎవరూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు సహకరించొద్దని.. కఠిన శిక్ష పడే వరకు తమ పోరాటం తాము చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, మధురవాడలోని ఎన్వీపీ లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోన్న విద్యార్థినిపై అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థి తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు.

ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గత ఆగస్ట్ 13న ఆమెను స్నేహితుడి ఇంటికి తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు.. ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆమెను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వంశీతో పాటు అతడి స్నేహితులు ఆనంద్, జగదీశ్, రాజేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో సైతం హాజరుపరిచారు.

Advertisement

Next Story