ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర..

by Sumithra |
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై మరోసారి హత్యకు జరుగుతున్న కుట్రను నిజామాబాద్ పోలీసులు భగ్నం చేశారు. జీవన్ రెడ్డిని మట్టుబెట్టేందుకు జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సేకరించి నిలవుంచిన వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. సూత్రధారి గతంలో జీవన్ రెడ్డి పై హత్యాయత్నం చేసిన కేసులు జైలులో ఉండడం గమనార్హం. తన ఇంట్లో పేలుడు పదార్థాలు నిలువ ఉంచిన మహిళను పోలీసులు పట్టుకోవడంతో కుట్ర వ్యవహారం వెలుగు చూసింది.

నిజామాబాద్ నగరం లోని కంటేశ్వర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో రూరల్ పోలీసుల శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఎంఐజి-122 ఇంటిలో 95 జిలెటిన్ స్టిక్స్, 10 డిటొనేటర్స్ స్వాధీనం చేసుకుని ఇంటి యజమానురాలు బొంత సుగుణను అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నట్టు నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ జగడం నరేష్ తెలిపారు. పోలీసుల విచారణలో సుగుణ తన ఇంట్లో డిటెొనేటర్లను, జిల్టిన్ స్టిక్ లను మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన ప్రసాద్ గౌడ్ దాచుకున్నట్లు వెల్లడించిందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ప్రసాద్ గౌడ్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నం కేసులో నిందితుడు..

గత సంవత్సరం హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంట్లో తుపాకితో ఎమ్మెల్యే హత్యకు కుట్రపన్నిన ప్రసాద్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రసాద్ గౌడ్ భార్య మాక్లురు మండలం కల్లేడ గ్రామసర్పంచ్ కాగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో వారికి విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రసాద్ గౌడ్ చంచల్ గూడా జైల్లో పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు కాగా కారగారంలో ఉన్నారు. ప్రసాద్ గౌడ్ పై ఎమ్మెల్యే పై హత్యాయత్నం, ఇంటిలోకి అక్రమంగా ప్రవేశం, మారుణ యుధాలు కలిగి ఉండడం లాంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత పేలుడు పదార్థాలను సేకరించి అవసరం వచ్చినప్పుడు వాడేందుకు నిలువ ఉంచినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చంచ ల్ గుడా జైల్లో ఉన్న ప్రసాద్ గౌడ్ ను పిటి వారెంట్ పై తీసుకువచ్చి విచారించే యోచనలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed