- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 500 కోసం గుర్తు తెలియని మహిళను హత్య.. నిందితుడికి జీవిత ఖైదు
దిశ,అబ్దుల్లాపూర్మెట్ : రూ.500ల కోసం ఓ గుర్తు తెలియని మహిళను రాయితో కొట్టి దారుణంగా చంపాడు. ఆమె వద్ద ఉన్న రూ. 500 దొంగిలించి శవాన్ని వాగులో పడేసిన నిందితుడికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం 2021 నవంబర్ 12న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు గుర్తు తెలియని మహిళ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడి మృతి చెందినట్లు ఫిర్యాదు అందింది. అవుటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్ లో నీళ్ళు నిప్పుకునేందుకు వెళ్లిన ముసరాంబాగ్ కు చెందిన వేముల గోపికి సుమారు 30 -35 సంవత్సరాల ఆడమనిషి చనిపోయి నీళ్లలో తేలుతున్నట్టుగా గమనించి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాడు. సదరు ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో నిందితుడిగా సూర్యాపేట జిల్లా మట్టపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన షేక్ బడే మియా (24 )ను అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. అనంతరం ఛార్జిషీట్ చేశారు. ఇప్పటికి కూడా సదరు మహిళ గుర్తు తెలియని వ్యక్తిగానే రికార్డులో ఉంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బడే మియా పై నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా పలు హత్య నేరం కేసులు ఉన్నాయని చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా గురువారం నిందితుడికి రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కోర్టు న్యాయమూర్తి హరీష సదరు తీర్పును ఇచ్చింది. నిందితుడికి జీవిత ఖైదీతో పాటురూ. పదివేలు జరిమానా విధించారు. కేసులో కష్టపడి నిందితులను దోషులుగా నిర్ధారించి వారికి శిక్ష పడే విధంగా కృషి చేసిన వారికి రాచకొండ కమిషనర్ తో పాటు ఎల్బీనగర్ డిసిపి, వనస్థలిపురం ఏసీపీ లు అభినందనలు ఇప్పినట్లు అబ్దుల్లాపూర్మెట్ ఎస్ హెచ్ ఓ అంజిరెడ్డి స్పష్టం చేశారు.