- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమా రేంజ్ మర్డర్ ప్లాన్.. ఫర్‌ఫెక్ట్‌గా అమలు చేసిన తండ్రి
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ సినిమా రేంజ్ మర్డర్ జరిగింది. ఈ మర్డర్(murder)ను విదేశాలకు వెళ్లిన వ్యక్తి వీడియో రిలీజ్ చేసేంత వరకు పోలీసులు కనిపెట్ట లేకపోవడం విశేషం. వివరాల్లోకి వెళితే.. ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి కొంతకాలంగా కువైట్(Kuwait) లో పని చేస్తున్నాడు. తన కుతురిని..ఊళ్లోనే ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచి వెళ్లాడు. అయితే వెంకటరమణ తండ్రి ఆంజనేయులు(దివ్యాంగుడు) మనవరాలి వరస అయ్యే ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి.. గత వారం కువైట్ నుంచి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్త మంగంపేట వచ్చాడు. శనివారం తెల్లవారు జామున తన బిడ్డ తో అసభ్యంగా ప్రవర్తించిన ఆంజనేయులు ని దారుణంగా హత్య చేశారు. అనంతరం తిరిగి కువైట్ వెళ్లిపోయాడు. కాగా ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. తన కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో కువైట్ నుంచి వచ్చి తానే చంపి వెళ్లానని నిందితుడు ఆంజనేయ ప్రసాద్ సోషల్ మీడియా ద్వారా వీడియో రిలీజ్ చేశాడు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ వీడియో నిందితుడు మాట్లాడుతూ.. మనవరాలితో అసభ్యంగా ప్రవర్తించినందుకు తానే ఆంజనేయులను హత్య చేశానని, త్వరలో భారత్ కు తిరిగి వచ్చి పోలీసులకు లొంగిపోతానని చెప్పుకొచ్చారు.