ఆగని గుండెపోటు మరణాలు.. నగరంలో మరో వ్యక్తి మృతి...

by Sumithra |   ( Updated:2023-03-10 14:03:46.0  )
ఆగని గుండెపోటు మరణాలు.. నగరంలో మరో వ్యక్తి మృతి...
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ధ మందుల కోసం మెడికల్ కు వచ్చిన యువకుడు చాతి నొప్పితో కుప్పకూలి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం మధ్యహ్నం జరిగింది. ఈ సంఘటనకు సంబందించి పూర్తివివరాల్లోకెళితే నగరంలోని గాజులపేటకు చెందిన కుకునూరు రవి ( 32 ) రోజులాగే ఉదయం బట్టల షాప్ కు పనికి వచ్చాడు.

మధ్యాహ్నం 12 గంటలకు కంటేశ్వర్ బైపాస్ రోడ్డు వద్దగల ఎటీయంలో డబ్బులు డ్రా చేసుకొని మెడికల్ లో మెడిసిన్ తీసుకున్నాడు. ఒక్కసారిగా చాతిలో నొప్పిరావడంతో పక్కకు తిరిగి ఒకేసారి కుప్పకూలిపోగా తల గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. రవి భార్య లత ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed