మున్నేరులో శవమై తేలిన వ్యకి.. అది హత్యా, ఆత్మహత్యా..

by Sumithra |
మున్నేరులో శవమై తేలిన వ్యకి.. అది హత్యా, ఆత్మహత్యా..
X

దిశ, ఖమ్మం రూరల్​ : అనుమానస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రూరల్​ మండలం కస్నాతండ గ్రామానికి చెందిన బాణోత్​ భాస్కర్​ (40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి గ్రామ శివారులో ఉన్న మున్నేరు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.

సొమవారం తెల్లవారుజామున్నే మున్నేరులో శవమై తెలాడు. తలకు బలమైన గాయాలైనట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటక్రిష్ణ సంఘటన స్థలానికి చెరుకుని శవాన్ని పోస్టుమార్తం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హస్పిటల్​కు తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Next Story