ప్రాణం తీసిన డబుల్ బెడ్ రూమ్‌.. పురుగుల మందు తాగి ఆత్మహత్య ( వీడియో)

by Hajipasha |
ప్రాణం తీసిన డబుల్ బెడ్ రూమ్‌.. పురుగుల మందు తాగి ఆత్మహత్య ( వీడియో)
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అతడి ప్రాణం తీసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరైన కౌన్సిలర్ రాకుండా చేశాడని, ఇక నాకు రాదు.. నేను బతికి ఉండగా ఈ ఇల్లు రాదనుకొని ఆఖరికి సెల్పీ విడియో తీసుకుంటూ సిద్దిపేట కలెక్టరేట్ పరిసర ప్రాంతంలో పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది.

బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ మండలం అహ్మదీ పూర్ గ్రామానికి చెందిన శిలా సాగరం రమేష్ (40) సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్‌లో సుమారు 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషించుకుటున్నాడు. ఈక్రమంలో స్థానిక కౌన్సలర్ కెమ్మసారం ప్రవీణ్ శిలాసాగరం రమేష్ భార్య లలితకు ఎఎన్‌ఎం జాబ్ పెట్టిస్తానని చెప్పడంతో కొంత డబ్బులు అప్పగించారు. చివరికి జాబ్ రాక పోవడంతో సదురు డబ్బుల కోసం ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి తోడు రమేష్ వేరే పార్టీలో తిరుగుతున్నాడని డబుల్ బెడ్ రూమ్ మంజూరైన పట్టా ఇవ్వకుండా కౌన్సిలర్ కెమ్మసారం ప్రవీన్ అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.

ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..

కలెక్టరేట్ పరిసర ప్రాంతంలో శిలాసారం రమేష్ పురుగుల మందు తాగి ఆటో పక్కకు అపి పడిపోవడంతో విషయం గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. 108లో జిల్లా అసుపత్రికి తరలిస్తున్న క్రమంలో శిలాసాగరం రమేష్ మృతి చెందాడు. మృతుడికి భార్య లలిత, ఇద్దరు కుమారులున్నారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యలు మార్చరి ఎదుట ఆందోళన చేశారు. రమేష్ చనిపోవడానికి కారణమైన కౌన్సిలర్ ప్రవీన్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది. శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్త ఇమామ్ మద్దతు తెలిపారు. రమేష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed