అనుమతుల్లేని ఆసుపత్రులు సీజ్

by Sridhar Babu |
అనుమతుల్లేని ఆసుపత్రులు సీజ్
X

దిశ,పటాన్ చెరు : వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా నడిపిస్తున్న రెండు ప్రైవేటు క్లినిక్ లతో పాటు అధిక ధరలు వసూలు చేస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్ ను సంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ గాయత్రి దేవి సీజ్ చేశారు. గురువారం పటాన్ చెరు లో పలు ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా నడిపిస్తున్న ఇందిరా హాస్పిటల్ తో పాటు పద్మావతి క్లినిక్ ను మూసి వేయించి సీలు వేశారు.

అదేవిధంగా ధరల పట్టిక పెట్టకుండా అధిక రుసుం వసూలు చేస్తున్న గణేష్ డయాగ్నస్టిక్ సెంటర్ ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో గాయత్రీ దేవి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ధరలు వసూలు చేయడంతో పాటు అనుమతులు లేని ఆసుపత్రుల నిర్వహణపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి డయాగ్నస్టిక్ సెంటర్లో పరీక్షల రుసుముకు సంబంధించిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే వసూలు చేయాలని సూచించారు. అధిక ధరలు వసూలు చేసి నిబంధనలను విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed