Yashwant Sinha: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా .. పార్టీ పేరు ఇదే..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-09-16 00:46:14.0  )
Yashwant Sinha: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా .. పార్టీ పేరు ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్:కేంద్ర మాజీ విదేశాంగ, ఆర్థిక మంత్రి(Former External Affairs and Finance Minister) యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మాజీ ప్రధాని(Ex-PM) అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) సిద్ధాంతాలకు అనుగుణంగా 'అటల్ విచార్ మంచ్(Atal Vichar Manch)' పేరుతో తన పార్టీని ప్రారంభించారు.జార్ఖండ్‌(Jharkhand) రాష్ట్రం హజారీబాగ్‌(Hazaribag)లోని అటల్ సేవా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. అంతేగాక, మరికొన్ని నెలల్లో జగరనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు.జార్ఖండ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటీవల తన కార్యకర్తలతో భేటీ అయిన యశ్వంత్ సిన్హా.. కొత్త పార్టీ ఏర్పాటుపై వారితో చర్చలు జరిపారు. ఆ తర్వాత తన మద్దతుదారులతో కలిసి ఆదివారం పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు.

ఐఏఎస్(IAS) అధికారి అయిన యశ్వంత్ సిన్హా.. 1977లో బీహార్ ముఖ్యమంత్రి(Chief Minister of Bihar) కర్పూరీ ఠాకూర్‌(Karpoori Thakur)కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1984లో ఐఏఎస్‌కు రాజీనామా చేసి లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్(Jayaprakash Narayan) స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. హజారీబాగ్ లోక్‌సభ స్థానం నుంచి 1988, 1999, 2009ల్లో గెలుపొందారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో సిన్హా క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.ఇక, 2021లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాగా జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.ఆ రాష్ట్రంలో ప్రస్తుతం JMM-కాంగ్రెస్-RJD కూటమి అధికారంలో ఉంది. జార్ఖండ్ లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా, జేఎంఎం 3 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed