- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Gold Price: కొత్త గరిష్ఠాలకు చేరిన బంగారం ధర

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. కొన్ని వారాల నుంచి స్థిరంగా ఉన్న పసిడి గత వారం రోజుల్లో రూ. 2,500 కి పైగా పెరిగింది. అంతర్జాతీయ పరిణామాల మధ్య ఆభరణాల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో బుధవారం దేశ రాజధానిలో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 860 పెరిగి రూ. 82,730కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. వరుసగా ఆరో రోజు పెరగడంతో ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల పది గ్రాములు బంగారం రూ. 750 పెరిగి జీవితకాల గరిష్ఠం రూ. 75,250 వద్ద ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానం చుట్టూ ఉన్న అనిశ్చితి నెలకొన్న కారణంగా బంగారం వంటి సురక్షితమైన సాధానాలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోనూ డాలర్ బలహీనపడటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ట్రంప్ ధోరణితో దీర్ఘకాలిక వాణిజ్య ఆందోళనల వల్ల పెట్టుబడులు బంగారంవైపునకు మళ్లుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ విశ్లేషకులు సౌమిల్ గాంధీ తెలిపారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. బుధవారం రూ. వెయ్యికి పైగా పెరిగి రూ. 1,04,000కి చేరుకుంది.