- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Shahi Idgah: షాహీ ఈద్గా మసీదు సర్వేపై నిషేధం కొనసాగింపు.. మరోసారి స్టే విధించిన సుప్రీంకోర్టు

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న షాహీ ఈద్గా మసీదు సముదాయాన్ని కోర్టు పర్యవేక్షణలో సర్వే చేసేందుకు అనుమతినిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మరోసారి స్టే విధించింది. కోర్టు ఆధ్వర్యంలో సర్వేకు వ్యతిరేకంగా ‘కమిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ట్రస్ట్ షాహీ మసీద్ ఈద్గా’ పిటిషన్‌పై విచారణను సైతం వాయిదా వేస్తున్నట్లు సీజేఐ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పిటిషన్‌ను విచారిస్తామని పేర్కొంది. సుప్రీంకోర్టులో మసీదు కేసుకు సంబంధించిన మూడు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని సీజేఐ సంజీవ్ ఖన్నా తెలిపారు. తదుపరి విచారణ వరకు కోర్టు పర్యవేక్షణలో ఉన్న షాహీ ఈద్గా మసీదు సముదాయం సర్వేను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అలాగే ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, గతేడాది డిసెంబర్ 14న హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు స్వీకరించింది. మసీదు ప్రాంగణాన్ని సర్వే చేయడానికి కోర్టు కమిషనర్‌ను నియమించాలని ఆదేశించింది. అయితే దీనిని ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఈ నెల16న హైకోర్టు ఆర్డర్స్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తాజాగా మరోసారి దీనిపై విచారణ జరగగా స్టే ను కొనసాగిస్తున్నట్టు తెలిపింది.