- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Karge: నేరస్థుల రక్షణకే బీజేపీ ప్రాధాన్యత.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

దిశ, నేషనల్ బ్యూరో: ‘బేటీ బచావో, బేటీ పడావో’ (Beti Bachao, Beti Padhao) పథకం పదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) విమర్శలు గుప్పించారు. బీజేపీ మహిళల భద్రత కంటే నేరస్థుల రక్షణకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బేటీ బచావో, బేటీ పడావో పథకానికి సంబంధించిన డేటా ప్రదర్శనను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని, ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో దాదాపు 80 శాతం ప్రకటనలకే ఖర్చు చేశారని తెలిపారు. స్టాండింగ్ కమిటీ ఈ నివేదికను బహిర్గతం చేసిన తర్వాత 2018-19 మరియు 2022-23 మధ్య ఈ పథకం కోసం నిధులు 63శాతం తగ్గించారని వెల్లడించారు. ‘ప్రతి ట్రక్కు వెనుక బేటీ బచావో నినాదం పెట్టడం, గోడలపై పెయింటింగ్ వేయడం వల్ల మహిళలపై నేరాలు ఆగిపోతాయా?. వారికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయా? ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరుస్తాయా. అఘాయిత్యాల తర్వాత మహిళలకు న్యాయం జరుగుతుందా? బీజేపీ చేస్తున్న బూటకపు ప్రకటనలు మహిళలపై నేరాలను నియంత్రించలేవు’ అని పేర్కొన్నారు. కాగా, దేశంలో లింగ వివక్ష, మహిళా సాధికారతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం 2015 జనవరి 22 న హర్యానాలోని పానిపట్‌లో బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రవేశపెట్టింది.