IND vs BAN : చెన్నయ్‌కు చేరుకున్న బంగ్లా జట్టు

by Harish |
IND vs BAN : చెన్నయ్‌కు చేరుకున్న బంగ్లా జట్టు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాతో టెస్టు సిరీస్ కోసం బంగ్లాదేశ్ భారత్‌లో అడుగుపెట్టింది. బంగ్లా ఆటగాళ్లు ఆదివారం చెన్నయ్‌కు చేరుకున్నారు. చెన్నయ్‌లోని చెపాక్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 23 వరకు తొలి టెస్టు జరగనుంది. ఢాకా ఎయిర్‌పోర్టులో బంగ్లా మీడియాతో కెప్టెన్ నజ్ముల్ శాంటో మాట్లాడుతూ.. భారత్‌తో టెస్టు సిరీస్ విజయంపై దీమా వ్యక్తం చేశాడు. పాక్‌పై సిరీస్ విజయం తమ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపిందన్నాడు. ‘భారత్‌తో మాకు సవాలే. కానీ, పాకిస్తాన్‌పై సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసం పొందాం. రెండు టెస్టుల్లో గెలవాలనుకుంటున్నాం. మన పని మనం సక్రమంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఐదు రోజులు బాగా ఆడటమే మా లక్ష్యం అదే.’ అని తెలిపాడు. కాగా, బంగ్లాదేశ్ ఇటీవల పాకిస్తాన్‌పై చిరస్మరణీయ విజయం అందుకున్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed