Zelenskiy: ఆ కారణం వల్లే ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది.. జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
Zelenskiy: ఆ కారణం వల్లే ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది.. జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలు ఆయుధాలు నెమ్మదిగా సరఫరా చేస్తుండటం వల్లే తమ దళాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. తూర్పు ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలలో రష్యా పట్టుసాధిస్తోందని తెలిపారు. ఈ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని చెప్పారు. ఉక్రెయిన్ సైన్యం అక్కడ సన్నద్ధం కాలేదని స్పష్టం చేశారు. తమ సైనికులకు ఆయుధాలు కరువయ్యాయని నొక్కి చెప్పారు. అమెరికా, యూరోపియన్ దేశాలు అందిస్తున్న ఆయుధ ప్యాకేజీలు చాలా నెమ్మదిగా వస్తున్నాయని చెప్పారు.

తాము సిద్ధంగా ఉండటానికి 14 బ్రిగేడ్‌లు అవసరమని, కానీ ఇప్పటి వరకు కేవలం నాలుగు కూడా సిద్ధం చేయలేదని తెలిపారు. ఆయుధాల సరఫరాలో వేగం పెంచాలని సూచించారు. రష్యాలో లోతైన సైనిక లక్ష్యాలను ఛేదించడానికి సుదూర ఆయుధాలను ఉపయోగించేందుకు ఉక్రెయిన్‌కు యూఎస్ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే రష్యన్ జెట్‌లు 500 కిలోమీటర్ల వరకు పనిచేయడం ప్రారంభించాయని తెలిపారు. ఉక్రెయిన్ ను బలపరిస్తే రష్యా తమంతట తామే చర్చలకు తిరిగి వస్తుందని నొక్కి చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్‌కు గణనీయమైన సహాయ ప్యాకేజీ అందించేందుకు కృషి చేస్తున్నామని వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed