Punjab Kings: పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం.. కొత్త హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్..!

by Maddikunta Saikiran |
Punjab Kings: పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం.. కొత్త హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్..!
X

దిశ, వెబ్‌డెస్క్:ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) వచ్చే సీజన్ కోసం హెడ్‌కోచ్‌(Head Coach)గా ఆస్ట్రేలియా(Australia) మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌(Ricky Ponting) ను నియమించింది. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదికగా పంజాబ్ అధికారంగా ప్రకటించింది.పాంటింగ్ నాలుగు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు.దీంతో అతడు ఐపీఎల్ 2025 సీజన్​ నుంచి 2028 వరకు పంజాబ్ జట్టుకు హెడ్‌కోచ్​గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్‌ స్పందిస్తూ..'కోచ్‌గా అవకాశం కల్పించినందుకు పంజాబ్ కింగ్స్‌ యాజమాన్యానికి కృతజ్ఞతలు.పంజాబ్ కోచ్‌గా రావడం ఆనందంగా ఉంది. కొత్త ఛాలెంజ్‌ని స్వీకరించడానికి నేను ఎల్లప్పుడూ సిద్దమే, వచ్చే సీజన్ నుంచి మీరు సరికొత్త పంజాబ్ కింగ్స్ టీమ్ ను చూస్తారని' పాంటింగ్‌ పేర్కొన్నారు. కాగా పాంటింగ్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)కు కోచ్‌గా పనిచేశాడు. అతని పదవీకాలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 2019, 2020,2021 సీజన్ లలో ప్లేఆఫ్‌కు చేరుకుంది.కాగా పంజాబ్ జట్టు గత 7 సీజన్లలో ఆరుగురు కోచ్ లను మార్చడం విశేషం.

Advertisement

Next Story