- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ అనారోగ్య సమస్యతో చాలా బాధ పడ్డా .. దాని వలనే షూటింగ్ మధ్యలో ఆపేశారు : Allu Arjun
దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకి వచ్చిన తర్వాత నుంచి ఆ షో రేంజే మారిపోయింది. ఈ ఎపిసోడ్ పార్ట్ 1, పార్ట్ 2 గా మన ముందుకొచ్చింది. రిలీజ్ అయి ట్రెండ్ అవుతుంది కూడా .. పార్ట్ 2 లో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ హైలెట్. ఇక త్వరలో, రిలీజ్ అవ్వబోయే పుష్ప 2 ( pushpa 2 ) గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.
అయితే, పుష్ప 2లో జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ లేడీ గెటప్ వేసిన విషయం మనకు తెలిసిందే. ఆ పోస్టర్స్, గ్లింప్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. వాటిని చూస్తుంటేనే బన్నీ ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. తాజాగా, బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ దీని గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. " నేను ఆ లేడీ గెటప్ వేసుకున్నప్పుడు ఫస్ట్ మీ నాన్న గారినే(ఎన్టీఆర్) తలుచుకున్నాను. వామ్మో ఆయన ఎలా చేసారో అనిపించేది. చాలా చాలా కష్టపడ్డాను ఆ ఒక్క గెటప్ కోసం. ఆ చీర, మేకప్, పైన నగలు అన్ని వేసుకొని కొన్ని గంటలు ఉండేసరికి బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. దాని వలన కొన్ని నెలలు బాధ పడ్డాను. ఆ పెయిన్ ఎక్కువయ్యి నా వల్ల కాక షూటింగ్ మధ్యలోనే ఆపేసారు మధ్యలో అని తెలిపాడు. ఇక ఆ లేడీ గెటప్ సీన్స్ సినిమాలో ఏ రేంజ్ లో పేలతాయో" చూడాల్సి ఉంది.