- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Turmeric: పసుపు వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మనం పసుపును ( Turmeric ) అన్ని కూరల్లో వాడుతుంటాము. పసుపు ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. కానీ, దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. అంతే కాకుండా, వీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి. అయితే, పసుపును అధిక పరిమాణంలో తీసుకుంటే మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పసుపు ఎక్కువగా వాడితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
పసుపును మితి మీరి తీసుకుంటే కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది కడుపు నొప్పి, ఆమ్లతను కలిగిస్తుంది. అలాగే, జీర్ణవ్యవస్థను దెబ్బతినేలా చేస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.
పసుపును అధికంగా తీసుకోవడం వలన కాలేయంపై ఒత్తిడి పడుతుంది. కొందరికి చర్మంపై పసుపు పడితే.. దురద, ఎరుపు దద్దుర్లు వస్తాయి. ఒక రోజులో 500 నుండి 2000 mg పసుపును తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.