- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేర్యాల మున్సిపాలిటీలో మ్యుటేషన్ బాధలు
దిశ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో ప్రజలను మ్యుటేషన్ బాధలు వెంటాడుతున్నాయి. చనిపోయిన వారి పేర్ల మీదనే ఇంటి పేర్లు ఉండటంతో ఆపదలో అవసరానికి ఆస్తులను అమ్ముకోలేక, ప్రభుత్వ సంక్షమాలు అందుకోలేక, నూతన గృహానిర్మాణాలు చేపట్ట లేని పరిస్థితి నెలకొంది. పట్టణంలో సుమారు 6 వేల వరకు ఇండ్లు ఉండగా వాటిలో 5200 ఇండ్లు నెంబర్లను కలిగి ఉన్నాయి. అయితే ఇందులో సుమారు 30 శాతం ఇంటి నెంబరులు గతంలో సంవత్సరాల కిందట చనిపోయిన వారి పేరు మీద ఉండటం, అప్పటి కాలంలో మరణ ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో పేరును వారసులు తమ పైన మార్చుకోలేక పన్నులు మాత్రం చెల్లిస్తూ వస్తున్నారు.
మూడు తరాలుగా మారని పేర్లు
చేర్యాల గ్రామపంచయతీగా ఉన్నప్పుడు ఇంటి పేరు మార్పిడి చేసుకునే తీరు సులువుగా ఉన్నప్పుడు వారసులు దరఖాస్తు చేసుకున్న అప్పటి అధికారులు నిర్లక్ష్యం చేయడంతో పట్టణం గ్రామ పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడే నాటికి సుమారు మూడు తరాలు మారడంతో పేరు మార్పిడి సమస్య మరింత జటిలం అయ్యింది.
మున్సిపల్ చట్టంతో మ్యుటేషన్ లో ఇబ్బందులు?
25 వేల జనాభా కలిగిన చేర్యాల మున్సిపాలిటీలో 12 వేల వరకు ఓటర్లు ఉన్న పట్టణం, గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ గా ఏర్పడటం, మున్సిపల్ కు ప్రత్యేక చట్టం ఉండటం, వాటి నిబంధనల ప్రకారం ఇంటి నెంబర్ వారసుల పేర్ల మీద మార్చుకోవాలంటే యజమాని మరణ ధ్రువీకరణ పత్రం,యజమాని కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం వంటివి అవసరం ఉండటంతో ప్రస్తుతం వారు ఎవరు లేకపోవడంతో పేరు మార్పిడి చేసుకోవడం ఇబ్బందిగా మారింది.
ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కోరుతున్న ప్రజలు
తరాలుగా పెండింగ్ లో ఉన్న ఇలాంటి సమస్యలు పరిష్కారం కావాలంటే ఉన్నతాధికారుల సమక్షంలో మున్సిపాలిటీలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పేరు మార్పిడిలో ఉన్న సమస్యలను పరిశీలించి తరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
వెసులుబాటు కోసం ప్రయత్నిస్తున్నాం : ఎస్. నాగేందర్ మున్సిపల్ కమిషనర్.
చేర్యాల గ్రామపంచాయతీ ఉన్నప్పటి నుండి ఈ సమస్య పెండింగ్లో ఉంది. మున్సిపాలిటీగా ఏర్పడ్డాక సమస్య మరింత జటిలం అయ్యింది. తద్వారా సుమారు 200 ల ఇండ్లకు కొత్త నెంబర్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెసులుబాటు ద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం.