‘విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ ఫుట్ బాల్ ఆడుకున్నారు’.. Minister Nara Lokesh

by Jakkula Mamatha |
‘విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ ఫుట్ బాల్ ఆడుకున్నారు’.. Minister Nara Lokesh
X

దిశ,వెబ్‌డెస్క్: ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ సీఎం జగన్ పై మంత్రి లోకేష్ మండిపడ్డారు. చిన్న పిల్లల చిక్కి డబ్బులు సైతం ఎగ్గొట్టిన తాను సుద్దపూసని అనడం విచిత్రంగా ఉందని మంత్రి లోకేష్ విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లిందని జగన్ గారు అంటూ వ్యాఖ్యానించారు. విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో రూ.3500 కోట్లు బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాక లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మంత్రి లోకేష్ అన్నారు. నేను యువగళం పాదయాత్ర చేసేటప్పుడు మీ నిర్వాకాన్ని విద్యార్థులు నా దృష్టికి తెచ్చారని గుర్తుచేశారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సమస్య పరిష్కరించాం అన్నారు.

‘నా నెత్తిన మీరు పెట్టిన బకాయిలు రూ.6500 కోట్లు. విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్‌బాల్ ఆడుకున్న మీరు ఇప్పుడు సుద్ధపుసనని చెప్పడం విచిత్రంగా ఉంది. ఇకపై రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకే చెల్లించేలా ఇటీవలే నిర్ణయం తీసుకున్నాం త్వరలో చెల్లిస్తాం’ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో మీ వల్ల భ్రష్టు పట్టిన విద్యారంగాన్ని గాడిన పెట్టడం మా బాధ్యత అని తెలిపారు. మీరు చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరిచేస్తూ ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులను మెగా డీఎస్సీ భర్తీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed