అదానీని శిక్షించే దమ్ము మోడీకి ఉందా?: సీపీఐ నారాయణ సవాల్

by srinivas |
అదానీని శిక్షించే దమ్ము మోడీకి ఉందా?: సీపీఐ నారాయణ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: పారిశ్రామిక వ్యాపార వేత్త అదానీ(Industrialist Adani)పై అమెరికా(America)లో లంచం కేసులు(Bribery cases) నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే అదానీ వ్యవహారంపై సీపీఐ నేత నారాయణ(CPI leader Narayana)మండిపడ్డారు. అలాగే అదానీ విషయంలో కేంద్రప్రభుత్వాన్ని తప్పుబట్టారు. అదానీని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ దమ్ము ప్రధాని మోడీ(Prime Minister Modi)కి ఉందా? అని సవాల్ విసిరారు. న్యూయార్క్‌(New York)లో అదానీపై నమోదైన లంచం కేసులో అమెరికా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందా లేక అదానీకి మద్దతుగా మోడీ అడ్డుపడతారా అన్నది వేచి చూడాలన్నారు. అదానీ అవినీతి పర్వం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోందని విమర్శించారు. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అవినీతి అంటే ఆశ్చర్యంగా ఉందని సీపీఐ నారాయణ ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed