- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPOs: డిసెంబర్‌లో 10 ఐపీఓలు.. రూ. 20,000 కోట్ల సమీకరణ
దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లలో ఐపీఓల సందడి కొనసాగుతోంది. వచ్చే నెలలోనూ సూపర్‌మార్ట్ చెయిన్ విశాల్ మెగా మార్ట్‌తో పాటు బ్లాక్‌స్టోన్‌కు చెందిన డైమండ్ గ్రేడింగ్ కంపెనీ ఇంటర్నేషనల్ జెమెలాజికల్ ఇన్‌స్టిట్యూట్(ఇండియా) సహా 10 కంపెనీలు పబ్లిక్ ఆఫర్‌కు రానున్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి రూ. 20,000 కోట్ల వరకు నిధులను సమీకరిస్తాయని మర్చంట్ బ్యాంకర్లు తెలిపారు. మిగిలిన కంపెనీల్లో విద్యారంగంపై పనిచేసే ఎన్‌బీఎఫ్‌సీ అవాన్సె ఫైనాన్షియల్ సెర్వీసెస్, సాయి లైఫ్ సైన్సెస్, హాస్పిటల్ చెయిన్ పారాస్ హెల్త్‌కేర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ డీఏఎం కేపిటల్ అడ్వైజర్స్ వంటివి ఉన్నాయి. గతవారం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, యూపీ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఐపీఓ కార్యకలాపాలు, నిధుల సేకరణ ప్రయత్నాలు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాదంతా ఐపీఓలకు సానుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని కంపెనీలు ఇబ్బందులు పడ్డాయి. లిస్టింగ్ తర్వాత అధిక వాల్యుయేషన్ ప్రభావంతో బలహీనపడ్డాయని విశ్లేషకులు పేర్కొన్నారు. చివరి నెలలో ఎన్నికలు, ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, గ్రే మార్కెట్ మళ్లీ యాక్టివ్‌గా మారడం వంటి పరిణామాల మధ్య ఐపీఓలు రాణిస్తాయని వెల్లడించారు.