Bangladesh: అదానీకి మరో షాక్.. ఆ ఒప్పందాలను సమీక్షించనున్న బంగ్లాదేశ్

by vinod kumar |
Bangladesh: అదానీకి మరో షాక్.. ఆ ఒప్పందాలను సమీక్షించనున్న బంగ్లాదేశ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ (Gautham adhani)పై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik haseena) హయాంలో అదానీ గ్రూప్‌తో కుదుర్చుకున్న ఇంధన ఒప్పందాన్ని సమీక్షించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Mohammad Younas) కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘2009 నుంచి 2024 వరకు హసీనా నిరంకుశ పాలనలో అదానీ గ్రూపుతో సంతకం చేసిన ప్రధాన విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలను సమీక్షించడానికి చట్టపరమైన దర్యాప్తు సంస్థను నియమించాలని విద్యుత్, ఇంధనం, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ జాతీయ సమీక్ష కమిటీ సిఫార్సు చేసింది’ అని తెలిపింది. అదానీ పవర్ లిమిటెడ్‌ (Adhani power limited)కు పూర్తి అనుబంధ సంస్థ అయిన బీఐఎఫ్‌పీఎల్ (BIFPL)1234.4 మెగావాట్ల బొగ్గు ఆధారిత ప్లాంట్‌తో సహా ఏడు ప్రధాన ఇంధన, విద్యుత్ ప్రాజెక్టులను సమీక్షింనున్నట్టు తెలుస్తోంది. మరో ఆరు ఒప్పందాలలో 1,320 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించడానికి చైనా కంపెనీతో ఒకటి ఉన్నాయి, మిగిలినవి గత ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న బంగ్లాదేశ్ వ్యాపార సమూహాలతో ఉన్నాయి. దర్యాప్తు అనంతరం ఒప్పందాలను రద్దుచేయడం లేదా పునఃపరిశీలించడం జరగనున్నట్టు సమాచారం.

Advertisement

Next Story