TTD: శ్రీవారి నిధులపై టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం

by Jakkula Mamatha |
TTD: శ్రీవారి నిధులపై టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధి(Development) దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలో కూటమి ప్రభుత్వ హ‌యాంలోఇటీవ‌ల ఏర్పాటైన టీటీడీ బోర్డు శ్రీవారి నిధుల‌కు సంబంధించి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ‌త ప్రభుత్వంలో ప‌నిచేసిన టీటీడీ బోర్డు(TTD Board) స్వామి వారి సొమ్ముల‌ను వివిధ ప్రైవేటు బ్యాంకు(private bank)ల్లో జ‌మ చేసింది. అయితే దీని పై కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వివిధ ప్రైవేట్‌ బ్యాంకు(private bank)ల్లో ఉన్న శ్రీవారి నగదు డిపాజిట్లను వెనక్కి తీసుకుని ప్రభుత్వ బ్యాంకు(Government Bank)ల్లో జమ చేసే అంశంపై టీటీడీ(TTD) ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొన్ని ప్రైవేట్‌ బ్యాంకు(private bank)ల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చనే నిబంధన ఉన్నప్పటికీ భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని టీటీడీ భావిస్తోంది. 2022 నవంబర్ లెక్కల ప్రకారం దాదాపు రూ.15,938 కోట్ల డిపాజిట్లు(deposits) 19 బ్యాంకుల్లో ఉన్నట్లు టీటీడీ పేర్కొంది. ఇందులో ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్‌ బ్యాంకులు కూడా ఉన్నాయి. చాలా వరకు డిపాజిట్ల(deposits)కు కాలపరిమితి పూర్తి కావస్తోంది. ఈక్రమంలో ఈ నగదును జాతీయ బ్యాంకు(National Bank)ల్లోనే డిపాజిట్‌ చేయాలని టీటీడీ నిర్ణయించింది.

Advertisement

Next Story