- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డును ఆవిష్కరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
దిశ, శేరిలింగంపల్లి : ప్రముఖ హెల్త్‌కేర్ ప్రొవైడర్ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్‌లో మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కుని, మెడికవర్ ఆరోగ్య కార్డు నాణ్యమైన ఆరోగ్యాన్ని సామాన్యులకు మరింత చేరువ కావడానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఆర్థిక స్థోమత గురించి చింతించకుండా కుటుంబ సంరక్షణను, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా ఈ ఫ్యామిలీ కార్డు ఒక ముందడుగు అని అన్నారు. అనంతరం మెడికవర్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డ్ తో రోగులతో బంధాన్ని బలోపేతం చేయడానికి, మేము సేవ చేసే ప్రతి కుటుంబానికి అత్యాధునిక పరికరాలు, సదుపాయాలతో , అనుభవజ్ఞులైన డాక్టర్స్ సరసమైన ధరలతో ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను విస్తరించడానికి కృషి చేస్తుందన్నారు.
మా 23 మెడికవర్ హాస్పిటల్స్ లో ఒపీ కన్సల్టేషన్‌లపై 30శాతం తగ్గింపు, ఒపీడీ పరిశోధనలపై శాతం, ఐపీ అండ్ డే-కేర్ సేవలపై 10శాతం తగ్గింపు అందిస్తుందన్నారు. బీమా, కార్పొరేట్ అడ్మిషన్ల కోసం వైద్యేతర సేవలపై, ఉచిత అంబులెన్స్ పికప్, డ్రాప్ 10 కి.మీ లోపు హోమ్‌కేర్ సేవలపై 30శాతం తగ్గింపు (ఫార్మసీ మినహా), రూ.5000 కంటే ఎక్కువ బిల్లులకు ఫార్మసీపై 20శాతం తగ్గింపు, హెల్త్ చెక్అప్స్ పై 10 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. కార్డ్ గరిష్టంగా నలుగురు డిపెండెంట్‌లను కవర్ చేస్తుందని, మెడికవర్‌లో ఖర్చు చేసే ప్రతి రూ.1000కి ఒక్కో పాయింట్‌కి రూ.1 చొప్పున రీడీమ్ చేసుకోగలిగే ఫ్యామిలీ రివార్డ్‌లను అందిస్తుందన్నారు. లబ్ధిదారులు పేరు, వయస్సు, చిరునామా, ఫోన్ నెంబర్, బ్లడ్ గ్రూప్ వంటి వివరాలను అందించడం ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. దీని తర్వాత ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ కార్డ్ వెంటనే వాట్సాప్ ద్వారా జారీ చేయబడుతుందని, అనంతరం ఫిజికల్ కార్డ్‌లు అందించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డితో పాటు ఇతర మెడికవర్ సిబ్బంది పాల్గొన్నారు.