పశువుల మందపై పెద్దపులి దాడి

by Sridhar Babu |
పశువుల మందపై పెద్దపులి దాడి
X

దిశ, వాంకిడి : మండలంలోని దాబా అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పశువుల మందపై పెద్దపులి దాడిచేసి ఐదు పశువులను గాయపర్చింది. మేతకు వెళ్లిన పశువుల మందపై ఒక్కసారిగా పులి దాడి చేయడంతో స్థానికులు గమనించి పెద్దగా కేకలు వేయడంతో పులి పరారైంది. కానీ అప్పటికే బండకాసా, దాబా గ్రామాలకు చెందిన ఐదు పశువులపై పెద్దపులి దాడి చేసి గాయపర్చింది.

సమాచారం అందుకున్న అసిఫాబాద్ రేంజ్ ఆఫీసర్ గోవింద్ సింగ్ సర్దార్ గాయపడిన ఐదు పశువులను పరిశీలించి వెటర్నరీ డాక్టర్ సమీక్షంలో ప్రథమ చికిత్స చేయించారు. దాబా, బండకాసా గ్రామాల ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అటవీ పరిసర గ్రామాల ప్రజలు పులి సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. పులి దాడిలో మరణించిన పశువులకు అటవీశాఖ ద్వారా తక్షణ సహాయం కింద రూ.8 వేల నష్టపరిహారం అందిస్తున్నట్లు ఎఫ్ఆర్వో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed