- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Satyadev: అలాంటి వాళ్లు మా సినిమాను రెండోసారి చూడండి.. ‘జీబ్రా’పై హీరో కామెంట్స్
దిశ, సినిమా: డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో సత్యదేవ్ (Satyadev) నటించిన తాజా చిత్రం ‘జీబ్రా’ (zebra). యాక్షన్ క్రైమ్ ఎంటర్‌టైనర్ (Action Crime Entertainer)గా తెరకెక్కిన ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ (Ishwar Karthik) దర్శకత్వం వహించాడు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ (Old Town Pictures), పద్మ ఫిలిమ్స్ బ్యానర్ (Padma Films Banner)పై ఎస్ఎస్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించి మెప్పించగా.. ‘పుష్ప’ ఫేమ్ ధనంజయ ప్రధాన పాత్రలో కనిపించాడు. ఇక ‘జీబ్రా’ మూవీ నవంబర్ 22న ప్రేక్షుకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా.. తాజాగా ప్రెస్ మీట్ (press meet) నిర్వహించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సత్యదేవ్.
‘ఈ సినిమాతో డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ నన్ను రాటుతేలేలా చేశాడు. మనిషిగా ఈ మూవీతో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ (Transformation) అయ్యాను. అన్నయ్య చిరంజీవి (Megastar Chiranjeevi) చెప్పినట్లు మా సినిమా సూపర్ హిట్ (Super Hit) అయింది. అన్నిటికీ అతీతంగా ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రీమియర్స్ నుంచి ఈ మూవీకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రిలీజైన తర్వాత కూడా చాలా చోట్లు హౌస్ ఫుల్ అవుతుంది. దీంతో అర్థం చేసుకోవచ్చు. మా సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే.. ‘జీబ్రా’కు 80% పాజిటివ్ టాక్ (Positive Talk) వస్తుంటే.. 20% మాత్రం నెగిటివ్ టాక్ (Negative Talk) వస్తుంది. ఆ 20% ఎవరైతే ఉన్నారో వారు మరొకసారి మా సినిమాను చూడమని కోరుతున్నాను. ఎందుకంటే సినిమాలో ప్రతి పాయింట్‌కి ఒక లాజిక్ ఉంటుంది. ఒకవేళ మిస్ అయుంటే రెండోసారి చూసినప్పుడు కనెక్ట్ అవుతారని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ సత్యదేవ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read More...
Zebra Movie: సత్యదేవ్ ' జీబ్రా ' మూవీ ప్రేక్షకుల మనసు గెల్చుకుందా?