కులగణన లెక్కలు రాష్ట్ర పరంగా చేస్తేనే సముచితంగా ఉంటుంది : ఈటెల రాజేందర్

by Kalyani |
కులగణన లెక్కలు రాష్ట్ర పరంగా చేస్తేనే సముచితంగా ఉంటుంది : ఈటెల రాజేందర్
X

దిశ, చైతన్యపురి : కులాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కేటగిరీగా ఉన్నాయని, కుల గణన లెక్కలు కేంద్ర పరంగా కంటే కూడా రాష్ట్ర పరంగా తీస్తేనే సముచితంగా ఉంటుందనేది నా అభిప్రాయమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం కొత్తపేట బాబు జగ్జీవన్ రామ్ భవన్లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కులగణన శాస్త్రీయ అవగాహన పై రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడుతూ…. అంబేద్కర్ ఏ ఆలోచన అయితే చేశారో ఏ ఆశయాన్నయితే మనకు అందించారో కులాలు, మతాలు, అంతరాయాలు లేని మనిషిని మనిషి గౌరవించి అందరూ సమానంగా బ్రతికే సోషలిజం వస్తుందని భావించారో 75 ఏళ్లు గడిచిన తర్వాత కూడా అది సంపూర్ణంగా నెరవేరకపోగా ఇవాళ అనేక కులాలు దేశవ్యాప్తంగా మమ్మల్ని ఓబీసీలో చేర్చండని ఏబీసీడి వర్గీకరణ చేయండని అనేక ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు.

ప్రభుత్వపరంగా ఉన్న ఎంప్లాయిమెంట్ జనరేషన్ రెండు శాతానికి పడిపోయిందని తెలంగాణ గడ్డమీద భూమి, నీరు, కరెంటు ఇచ్చిన కూడా అందులో పని చేసే ఉద్యోగులు తెలంగాణ వారు లేరని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ కంపెనీకి ఇచ్చిన భూములలో కంపెనీలు పెట్టలేదని, ఉద్యోగాలు రాలేదని కంప్లైంట్ ఇస్తే అసెంబ్లీలో ఒక కమిటీ వేసినట్లు తెలిపారు. మేము సర్వేకి వెళ్తే తేలింది ఏంటంటే ఐటీ కంపెనీ పేరిట భూములన్నీ తీసుకొని వాటిని అమ్ముకున్నారు తప్ప ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులో గాని బీసీలకు రిజర్వేషన్ లేదని చట్టబద్ధంగా లేకపోయినప్పటికీ కూడా కన్వెన్షన్స్, ప్రాక్టీస్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది కానీ కన్వెన్షన్స్, ప్రాక్టీస్ లు అమలు కానీ ఏకైక వేదిక హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నారు.

కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా నాలుగు లక్షల కోట్లు పెట్టి నిరుద్యోగయువతకి ఏదైనా పని చెప్పాలని ఆలోచనకి వచ్చిందన్నారు. అమెరికాలాంటి అగ్రదేశం కూడా మా దగ్గర ఉద్యోగాలు లేవు ఎవరు రాకండి అని బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇది చూస్తే ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎలాఉందో అర్థమవుతుందన్నారు. కులగణన రాష్ట్ర ప్రభుత్వం పగడ్బంధీగా చేపట్టాలని కోరారు. మీరు చేసే ఉద్యమానికి మా సంఘీభావం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. ఈకార్యక్రమంలో సభాధ్యక్షలు వల్లకటి రాజ్ కుమార్, మాజీ ఎంపీ మధుయాష్కీ, జూలూరి గౌరిశంకర్, గుంటి నగేష్, గుండా నర్సయ్య, చామకూర రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story