భారీ జాక్ పాట్ కొట్టిన యువ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్

by Mahesh |
భారీ జాక్ పాట్ కొట్టిన యువ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ మెగా వేలం( IPL mega auction) దుబాయ్ వేదికగా రసవత్తరంగా కొనసాగుతోంది. రెండు రోజుల పాటు సాగే ఈ మెగా వేలంలో మొదటి రోజు కీలక ప్లేయర్లు వేలంలోకి వచ్చారు. ఇందులో భాగంగా యువ ప్లేయర్లను కొనేందుకు అన్నీ జట్లు చివరి వరకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే కేకేఆర్ జట్టు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన వెంకటేష్ అయ్యర్ ను కొనేందుకు ఆర్సీబీ(RCB), కేకేఆర్(KKR) జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. రెండు కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలో నిలిచిన వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) ను కోనేందుకు ఆయన పాత జట్టు కేకేఆర్ పోటీలో నిలవగా.. ఆర్సీబీ కూడా అతన్ని సొంతం చేసుకునేందుకు చివరి వరకు ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో చిట్ట చివరికి వెంకటేష్ అయ్యర్(Venkatesh Iyer) ను అతని మునపటి జట్టు కేకేఆర్(KKR) 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన మూడో ప్లేయర్ గా వెంకటేష్ అయ్యర్ నిలిచాడు.

Advertisement

Next Story

Most Viewed